కీర్తనలు దాసు శ్రీరాములు అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని
తోడి - త్రిపుట
పల్లవి:
అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని
అప్పటి గప్ప నిచ్చెనటే చెలి
॥అప్పటి॥
అనుపల్లవి:
తప్ప నే నితరుల - దరి జేరనని యెన్నో
చెప్పిన తలచు కొంటినే ఓ చెలి
॥అప్పటి॥
చరణ:
తొలినాటి వగలే యా - మరునాటి పగలు మా
చెలిమి కాకియు కో - వెల చందమాయెనే
॥అప్పటి॥
పడతి మగవారి బారు - పడకింట మితిమీరు
గడప దాటిన వెనుక - కారు మన వారు
బడిబడి నాడు వారు - బ్రతిమాలి పాదముల
బడి వేడు కొన్నగాని - పలుకే మేల్మి బంగారు
॥అప్పటి॥
కాసు వీసము లిచ్చి - గోస గూసల మసి
బూసి నేరేడు గాయ - జేసెనే చెలి
వేసాలమారి మా - వేణుగోపాల మూర్తి
దాసు శ్రీరామకవి - డాసి యేలుచుండెనే ఓ చెలి
॥అప్పటి॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - appaTi maaTalaku - duppaTichce gaani - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )