కీర్తనలు దాసు శ్రీరాములు కామాంధకారము - కప్పెనా నీవింత
శంకరాభరణము - చాపు
పల్లవి:
కామాంధకారము - కప్పెనా నీవింత
కనుగానక యుంటివి
॥కామాంధ॥
అనుపల్లవి:
ఏమిరా తెలియదా - ఇది కాదని నీకు
నీముద్దు కోమలి - నివసించిన యిల్లు
॥కామాంధ॥
చరణ:
పంజరమున చిలుక - పగిది నేనుండగ
- పరులకు పనియేమిరా
సంజ చీకటిదారి - జాడ తెలియలేక
కంజాత నయన ఇ - క్కడ వచ్చితివా లేక
॥కామాంధ॥
వగకాడ నీవంటి - వానికి నావంటి
- మగువ పొందది ఏలరా
మొగలి పూజిదుమ బో - ముల్లా కంటిన యట్లు
తగని ఈ నా యిల్లు - దారి దాకెనా లేక
॥కామాంధ॥
భ్రమ లేల నిన్నటి - రాతిరి గలసిన
- భామ ఇల్లిది గాదురా
రమణీయ దాసు శ్రీ - రామ కవీంద్రుని
అమల చిత్తాంబుజ - మనుకొంటివా లేక
॥కామాంధ॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - kaamaaMdhakaaramu - kappenaa niiviMta - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )