కీర్తనలు దాసు శ్రీరాములు మగువ నేనెంత - మంద బుద్ధి నైతి
తోడి - చాపు
పల్లవి:
మగువ నేనెంత - మంద బుద్ధి నైతి
మగని తూలనాడితి - మోస పోయితి
॥మగువ॥
అనుపల్లవి:
తెగువ తొల్లి యిల్లు - తిరిగి చూచుచున్న
నగధర నినుజూచి - నగరా పొమ్మంటి
॥మగువ॥
చరణ:
బెట్టు విడచి మ్రొక్కు - బెట్టు వచ్చిన నన్ను
బట్టకురా నీ - బవిసి దెలిసె నంటి
॥మగువ॥
వాసిగా నాతోడ - యూసులాడెదనన్న
దాసు శ్రీరామ కవి - డాసి ఏలుకొమ్మంటి
॥మగువ॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - maguva neeneMta - maMda buddhi naiti - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )