కీర్తనలు దాసు శ్రీరాములు మనసు దీరెనా సామి - మనసు దీరెనా సామి
దర్బారు - మిశ్రచాపు
పల్లవి:
మనసు దీరెనా సామి - మనసు దీరెనా సామి
వనజాక్ష దాని పొందు - వైకుంఠ మాయెనా
॥మనసు॥
చరణ:
మరుగు పరచ నేటికిరా - మంచిది లేరా
మెరుగు బోణి వగలు - తిరుమంత్రము లాయెనా
॥మనసు॥
చొక్కియున్న జాడలు - చూచిన చాలు దాని
ప్రక్క బండి యుండుటే - బ్రహ్మానంద మాయెనా
॥మనసు॥
వినుము తోట్ల వల్లూరి - వేణుగోపాల శౌరి
ఘనుడు దాసు శ్రీరామ - కవి సన్నుతి జేసెనా
॥మనసు॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - manasu diirenaa saami - manasu diirenaa saami - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )