కీర్తనలు దాసు శ్రీరాములు ముంజేతి కంకణ - మ్మున కద్ద మేలనే
సావేరి - రూపకం
పల్లవి:
ముంజేతి కంకణ - మ్మున కద్ద మేలనే
రంజిల్లు వాని గుణము - రమణి మన మెరుగమే
॥ముంజేతి॥
చరణ:
కమ్మదనపు మాటలనె - కడుపులోనొక విధమె
కొమ్మవాని వలపు ని - క్కమ్ముగాదె నమ్మరాదె
॥ముంజేతి॥
మాటలును చేతలును - మనవద్దనే చెలియ
మాటికి పడకలా - మగువతోడ తగవదేడ
॥ముంజేతి॥
భాసురాంగి నన్నుమాయ - జేసె నేనేమి సేతు
దాసురామకవి మనోని - వాసుడాయె మోసమాయె
॥ముంజేతి॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - muMjeeti kaMkaNa - mmuna kadda meelanee - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )