కీర్తనలు దాసు శ్రీరాములు ముక్కు పచ్చలారని చిన్నదాన - న
యదుకుల కాంభోజి - త్రిపుట
పల్లవి:
ముక్కు పచ్చలారని చిన్నదాన - న
న్నెక్కడి కంపెదరే - సిగ్గాయె న
న్నెక్కడి కంపెదరే
॥ముక్కు॥
అనుపల్లవి:
నిక్కము రేయెల్ల - నిదుర బోయెద నమ్మా
తక్కిన పనులేమి - నేనెరుగనో యమ్మా
॥ముక్కు॥
చరణ:
వంచిన నాచేయి - మంచి గంధములోన
ముంచి యెత్తెదరేలనే - సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే
మంచిదేరమ్మ - మగవారి చేయిబట్టు
మంచు దెల్పెదరు నా - కలవాటు లేదమ్మా
॥ముక్కు॥
అందముగా సున్న - మాకీనె దీసి నే
- నంటరాయ నేరనే
అందగాని నోటి - కందీయ మనియెద
రిందరిలో మన సెట్టు - లొప్పునోయమ్మా
॥ముక్కు॥
ఈ పనులా పను - లేల చెప్పెదరు నే
- నేపని కోపలేనే
ప్రాపై దాసుశ్రీ - రాము నేలిన వేణు
గోపాల దేవుని - గూడి యుండెదనమ్మా
॥ముక్కు॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - mukku pachchalaarani chinnadaana - na - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )