కీర్తనలు దాసు శ్రీరాములు ముద్దుముద్దుగ పిలవనా - నా సామిని
అఠాణ - చాపు
పల్లవి:
ముద్దుముద్దుగ పిలవనా - నా సామిని
ముదుగు ముదుగుగ పిలువనా - నా సామిని
॥ముద్దు॥
అనుపల్లవి:
ముద్దు ముద్దుగ పిలువ - చులక సేయునేమో
ముదుగు ముదుగున పిలువ - బాగని తోచేనే
॥ముద్దు॥
చరణ:
పాటలు పాడుదునా - మంచి ఆటలు ఆడుదునా
వాటమైన గుబ్బ - పోటు జూపింతునా
గోటి కొన చెక్కిలి - మీటుదునా
॥ముద్దు॥
ఆకు మడుపు లిత్తునా - మంచి తావి
అత్తరు పై బూతునా
తేకువతో జడ - త్రిప్పి కొట్టుదునా
మోకమోవి చిగురు - మోవి గరతునా
॥ముద్దు॥
కోపగించకు మందునా - యేర వేణు
గోపాల రమ్మందునా
శ్రీపూర్ణమగు దాసు - శ్రీరాము మనమున
ప్రాపై నివసించి - పాలించమందునా
॥ముద్దు॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - muddumudduga pilavanaa - naa saamini - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )