కీర్తనలు దాసు శ్రీరాములు వట్టు బెట్టెద నాచై - పట్టరాకురా సామి
ఆనందభైరవి - చాపు
పల్లవి:
వట్టు బెట్టెద నాచై - పట్టరాకురా సామి ॥వట్టు॥
అనుపల్లవి:
గట్టిగ పదివేల - కరకు వరాల మూట
గట్టి నా కట్టెదుట - బెట్టి మాటాడర
॥వట్టు॥
చరణ:
గారాన నొక యమ్మ - కని పెంచిన బిడ్డ
యూరకే వచ్చునా - తేరా సరిగ చీర
॥వట్టు॥
వలచి వచ్చినవారు - విలువ బెట్టకపోరు
అలరింతు తేరా మంచి - ఆణి ముత్యాల పేరు
॥వట్టు॥
భాసుర వేణుగో - పాల జేజేల మిన్న
దాసు శ్రీరామకవి - డాసి ఏలక యున్న
॥వట్టు॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - vaTTu beTTeda naachai - paTTaraakuraa saami - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )