కీర్తనలు దాసు శ్రీరాములు వలచితిరా నిను - వదలను సామీ
దర్బారు - చాపు
పల్లవి:
వలచితిరా నిను - వదలను సామీ
జలజాక్ష నీ ద - ర్శనమే పదివేలు
॥వలచితి॥
చరణ:
ఇచ్చిన సరే - ఇవ్వకున్న సరే
వచ్చి నాతో నొక - ముచ్చటాడిన చాలు
॥వలచి॥
నీళ్లనే ముంచు - పాలనే ముంచు
కాళ్లకు మ్రొక్కెద - కరుణించరా
॥వలచి॥
వేణుగోపాలా - వేడితి చాలా
రాణించు దాసు శ్రీ - రాము నుల్లము వలె
॥వలచి॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - valachitiraa ninu - vadalanu saamii - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )