కీర్తనలు దాసు శ్రీరాములు వాడా నిను బంపునవాడా - నను బిల్వ
యదుకుల కాంభోజి - త్రిపుట
పల్లవి:
వాడా నిను బంపునవాడా - నను బిల్వ
వనిత నే రాననవే - పోపోవే
॥వాడా॥
చరణ:
చింతలేల వాడు - చీటీ బంపెనా
సంతోషమే యనవే - పోపోవే
॥వాడా॥
చిన్ననాటి నుండి - చేసిన తన తోడి
చెలిమి చాలు ననవే - పోపోవే
॥వాడా॥
కోపమేటికి తోట్ల - వల్లూరి శ్రీవేణు
గోపాలా దగుననవే - పోపోవే
॥వాడా॥
వేయేల దాసు శ్రీ - రామ హృదయవాసి
వై యుండుమీ యనవే - పోపోవే
॥వాడా॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - vaaDaa ninu baMpunavaaDaa - nanu bilva - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )