కీర్తనలు దాసు శ్రీరాములు వారి వీరి జోలి - నాకేలరా సామి
ద్విజావంతి - మిశ్రచాపు
పల్లవి:
వారి వీరి జోలి - నాకేలరా సామి
వద్దు వద్దు చాలురా
॥వారి॥
అనుపల్లవి:
నోరు మూసుకొని - యూరకున్న గాని
తీరదాయె దాని - పోరు నేనేమి సేతు
॥వారి॥
చరణ:
అల దానితో నీవు - కలసి కులుకుచున్న
- నదె నాకు పదివేలురా
వలపు నాపై నీకు - కలుగ కున్న నేమి
తొలి నోము ఫలమని - తలచితినే కాని
॥వారి॥
వలవల కన్నీరు - వరదలై పారగా
- తల వ్రాసెగా దైవము
నిలచి నీతో నింక - పలుకు లేమిటికిరా
అలరు తేనియ విస - మైన గ్రోలెద గాని
॥వారి॥
వారక శ్రీతోట్ల - వల్లూరి వేణుగో
- పాలా మ్రొక్కెద మ్రొక్కెద
ధీరుడైన దాసు - శ్రీరామ కవి కృతి
సారమైన విని - సామి నన్నేలరా
॥వారి॥
AndhraBharati AMdhra bhArati - dAsu SrIrAmulu padamulu jAvALIlu Padamulu Javalilu Javaleelu kIrtanalu - vaari viiri jooli - naakeelaraa saami - dAsu SrIrAmulu - Dasu Sriramulu - Dasu Sreeramulu - Lyrics of Dasu Sreeramulu Padams and Javalis ( telugu literature andhra )