కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీకేశవ మాం పాలయ
భైరవి - చతురశ్ర రూపక
పల్లవి:
శ్రీకేశవ మాం పాలయ
రాకేందుముఖ కృపాలయ॥
అనుపల్లవి:
లోకేశ నారద సుగేయ
సాకేతాధిపాఽప్రమేయ॥
చరణము(లు):
భూసురవర పరిపూజిత
వాసుదేవ శరణాగత
దాసజన మనోంబుజాత
వాసరేశ సుఖ్యాత॥
శాసిత ఖలదోషరహిత
భాసురమణి భూషణయుత
వాసవముఖదేవవినుత
కోసల నృపశేఖర సుత॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrIkEshava mAM pAlaya - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )