కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య భజ మాధవమనిశం - వాసుదేవం
హిందూస్థాని కాపి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
భజ మాధవమనిశం - వాసుదేవం
భుజగాధిపతిశయనం - దేవదేవం॥
అనుపల్లవి:
అజరుద్రసురేశ వినుత చరణం
గజరాజ బలి ప్రహ్లాదాది శరణం॥
చరణము(లు):
మారజనకమంబుజనిభనయనం
నారదాదిమునిజనకృతనమనం॥
శూరమారీచరావణమథనం
శారదేందువదనం పరిభృతభువనం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - bhaja mAdhavamanishaM - vAsudEvaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )