కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరిపాహిమాం శ్రీహృషీకేశ
ధన్యాసి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పరిపాహిమాం శ్రీహృషీకేశ
కరివదన వాసుదేవ సర్వేశ॥
అనుపల్లవి:
దురితౌఘశైల కులిశేందిరేశ
పరితోషితేశ రుచిరాళికేశ॥
చరణము(లు):
వరశంఖ చక్ర పరిశోభితకర
సరసీరుహాక్ష కంసాద్యరిహర॥
కరవీరకుందసుమ హారధీర
సురబృంద వినుత పరమోదార॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - paripAhimAM shrIhR^iShIkEsha - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )