కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పాలయాశుపద్మనాభ
హంసధ్వని - చతురశ్ర రూపక
పల్లవి:
పాలయాశుపద్మనాభ
నీలదేహపాలితేభ॥
అనుపల్లవి:
బాలకృష్ణ భక్త సులభ
కాలనేమి హర సుశోభ॥
చరణము(లు):
వాసుదేవగానలోల
భూసురావనైకశీల
భాసమానరత్నమాల
శ్రీసమేత సరసలీల॥
భాసురాళి నిభకుంతల
వాసవాదివిబుధపాల
శాసితాఖిలారిజాల
దాసపార్థపరిపాల॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - pAlayAshupadmanAbha - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )