కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య వందేనిశమహం వారణవదనం
హంసధ్వని - చతురశ్ర త్రిపుట
పల్లవి:
వందేనిశమహం వారణవదనం
నందీశవాహన వరనందనం॥
అనుపల్లవి:
వందారుమండల విఘ్నవారణం
బృందారకాద్యభివందితచరణం॥
చరణము(లు):
భాసమానపాశాంకుశధరం
భూసురాళి పరిపాలనపరం॥
భాసురమణి భూషితకంధరం
వాసుదేవచరణార్చన తత్పరం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - vaMdEnishamahaM vAraNavadanaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )