కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శారదే పాహిమాం సరోరుహనిభపదే
యదుకుల కాంభోజి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
శారదే పాహిమాం సరోరుహనిభపదే
సారసాక్ష శ్రీవాసుదేవ కరుణాన్వితే వరదే॥
అనుపల్లవి:
నీరజాసనజాయే నిఖిలవిద్యాప్రదే
నారదాదిసకలమునివినుతే సురదే॥
చరణము(లు):
చారువీణాది సుశోభితకరే
హీరమణిహారలసితకంధరే॥
వారణేంద్రగమనే నతసురనికరే
వారిజేక్షణే రుచిరబింబాధరే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shAradE pAhimAM sarOruhanibhapadE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )