కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పలుకదేమిర రామ నాతో
దేవమనోహరి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పలుకదేమిర రామ నాతో
పలికితె నీదేమి సొమ్ములు పోవునా॥
అనుపల్లవి:
జలజసంభవ భవాద్యమరవినుతపద
జలజనయన నీవు సుముఖుడై వేగమె॥
చరణము(లు):
నిరవధి సుఖదాయకుడని దెలిసి నే
నే నిరతము నిజముగ నమ్మియుండగ॥
మరచితివేమో మరవకురా రామ
గరుడగమన వాసుదేవ దయానిధే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - palukadEmira rAma nAtO - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )