కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నేరమేమి నాపై నీరజాక్షరామ
తోడి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నేరమేమి నాపై నీరజాక్షరామ
భారమేమినీకు నన్నుబ్రోచుటకు॥
అనుపల్లవి:
నేరమెంచకనె దయచేసి నీవు
క్రూరుడైన కాకాసురుని బ్రోవలేద॥
చరణము(లు):
అంతరాత్మ నాదు చింతదీర్చుమని
ఎంతవేడుకొందు పంతమేలనాతో॥
చింతితార్థమిచ్చే విభుడు నీవేగదా
దంతివరద శ్రీకాంత వాసుదేవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nEramEmi nApai nIrajAxarAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )