కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నన్ను బ్రోవగరాద వేగమె
మధ్యమావతి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నన్ను బ్రోవగరాద వేగమె
సన్నుతాంగ శ్రీసీతాపతే॥
అనుపల్లవి:
నిన్ను నమ్మినవాడని యెంచి నాదు
విన్నపంబు విని నిండుప్రేమతో॥
చరణము(లు):
జ్ఞాన భక్తి వైరాగ్యము గలిగి రాయి
ధ్యానమేమి జేసెనో దెలుపవయ్య॥
వానరేంద్రునిపై ప్రేమబుట్టలేద
గానలోల వాసుదేవ దేవదేవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nannu brOvagarAda vEgame - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )