కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య దయలేక బ్రతికి ఫలమేమి రాముని
శ్రీరంజని - చతురశ్ర త్రిపుట
పల్లవి:
దయలేక బ్రతికి ఫలమేమి రాముని
ధర్మాత్ముని ధరణిజా ప్రాణనాథుని॥
అనుపల్లవి:
వయసు శాశ్వతమని దెలిసి కాలుని
భయము లేక సదాదుర్వృత్తులైన మానవులు॥
చరణము(లు):
రాముని పరవాసుదేవుని నమ్మితె
కామిత ఫలములు కరగతమే గదా॥
ఈ మహిలో మహాత్ములకిది దెలుసును
శ్రీమదాది త్యాగరాజుడే సాక్షి గదా॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - dayalEka bratiki phalamEmi rAmuni - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )