కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య కరుణించినన్ను కాపాడు రామ
నవరస కన్నడ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
కరుణించినన్ను కాపాడు రామ
మరివేరె దిక్కెవరులేరు॥
అనుపల్లవి:
శరచాపధరాశ్రితపాపహర
ధరణీసుతావర మరవకుర॥
చరణము(లు):
పరమార్థమార్గము తెలియదు
పరమభక్తి జేసి సన్నుతించలేదు॥
శరణాగతరక్షక నీవెగద
పరవాసుదేవ భవభయముదీర్చి॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - karuNiMchinannu kApADu rAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )