కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య కృపతోను నన్ను రక్షించుటకు
హరికాంభోజి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
కృపతోను నన్ను రక్షించుటకు
ఎపుడైన నీవేగతిగాద రామ॥
అనుపల్లవి:
అపరాధమెంతో జేసినావనుచు
అపుడు ఇపుడని జెప్పగ॥
చరణము(లు):
వాసుదేవ పరాత్మర నీదుమహిమ
శ్రీసరోజభవాదులె తెలియలేరు॥
దాసజనులపాపమెల్ల దీర్చుటకు
నీసమానమెవరయ్య బ్రోవవయ్య॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - kR^ipatOnu nannu raxiMchuTaku - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )