కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నన్నుబ్రోచుటకెవరున్నారు
శంకరాభరణం - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నన్నుబ్రోచుటకెవరున్నారు
సన్నుతాంగ శ్రీసీతారమణ॥
అనుపల్లవి:
కన్నతండ్రియు నీవె గద
నన్ను మరవకురాశ్రితవరద
నిన్నునమ్మినవాడగద నా
విన్నపంబు వినరాదా వాదా॥
చరణము(లు):
కరుణాకరాఖిలజగదాధార శ్రీరఘువర
పరనారీసహోదర పాపవిదూర పరాత్పర॥
కరశోభితచాపశరస్మరకోటిసుందర
సురమానస మోదకర పర వాసుదేవ శ్రీకర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nannubrOchuTakevarunnAru - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )