కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీచాముండేశ్వరి పాలయమాం కృపాకరి శంకరి
బిలహరి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
శ్రీచాముండేశ్వరి పాలయమాం కృపాకరి శంకరి
శ్రితజనపాలిని మహాబలాద్రివాసిని మహిషాసురమర్దిని॥
అనుపల్లవి:
వాచామగోచర మహిమవిరాజితే వరగుణభరితే
వాక్పతిముఖ సురవందితే వాసుదేవ సహజాతే॥
చరణము(లు):
రాకానిశాకర సన్నిభ వదనే రాజీవలోచనే
రమణీయ కుందరదనే రక్షిత భువనే మణిరశనే॥
మూకవాక్ప్రదానవిఖ్యాతే మునివరనుతిసుప్రీతే
శ్రీకరతారకమంత్రతోషితచిత్తే సదా నమస్తే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrIchAmuMDEshvari pAlayamAM kR^ipAkari shaMkari - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )