కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ఎంతనిర్దయ నామీద నీకు
లతాంగి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
ఎంతనిర్దయ నామీద నీకు
దంతివరద శ్రీరుక్మిణీరమణ॥
అనుపల్లవి:
చింతితార్థదాయకుడనుచు దెలిసి
సంతతంబు నిన్నే నమ్మితి నయ్య॥
చరణము(లు):
వారిజాసనాది వినుతపాద నాదు
ఘోరపాపజాలమెల్ల దీర్చుటకు॥
వారిజాక్ష వాసుదేవ నీవుగాక
వేరెవ్వరున్నారయ్య బ్రోవవయ్య॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - eMtanirdaya nAmIda nIku - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )