కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నెరనమ్మితి నీవేగతి
చక్రవాక - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నెరనమ్మితి నీవేగతి
ధరణీసుతా వరరామ నిన్నే॥
అనుపల్లవి:
పరిపూర్ణ కటాక్షముతోను నన్ను
కరుణించుట కిదే సమయమని॥
చరణము(లు):
నన్ను బ్రోచుట నీకెంత భారము
నావిన్నపంబు వినరాద నాతో వాదా॥
కన్నతండ్రి నీవే గద
సన్నుతాంగ శ్రీవాసుదేవ సదా॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - neranammiti nIvEgati - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )