కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ఇంతపరాకేలనయ్య
కమాస్‌ - చతురశ్ర రూపక
పల్లవి:
ఇంతపరాకేలనయ్య
దంతిమోక్షదాయక నీకు॥
అనుపల్లవి:
ఎంతవేడుకొందు రమాకాంత
దాంత వినుత చరిత॥
చరణము(లు):
శ్రీధర పర వాసుదేవ
యాదవకులతిలక నాతో
వాద మేల పరమ పురుష
వేదశాస్త్ర తత్త్వజ్ఞులే॥
నీదుమహిమ తెలియలేరు
పాదములను నెరనమ్మితి॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - iMtaparAkElanayya - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )