కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య అభిమానముతో నన్ను బ్రోవరాద
షణ్ముఖప్రియ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
అభిమానముతో నన్ను బ్రోవరాద
దీనబాంధవ శ్రీవాసుదేవ॥
అనుపల్లవి:
శ్రీనికేతన నీనామము ప్రేమతో
ధ్యానము సేయుట సుజ్ఞాన మొసగరాద॥
చరణము(లు):
వారిధిశయన వారిజలోచన
వారిత దుర్జన వరఖగవాహన॥
కరిమోరలిడ నీవు కరుణతో బ్రోవలేద
పరమపురుష నిన్నే నమ్మిన వాడ గద॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - abhimAnamutO nannu brOvarAda - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )