కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరాత్పర రఘువర నిన్ను నెరనమ్మితిర పరమదయాకర
తోడి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పరాత్పర రఘువర నిన్ను నెరనమ్మితిర పరమదయాకర
సరోజభవముఖ సురేహితార్థద గిరీశ సురుచిర శరాసమదహర॥
అనుపల్లవి:
శిరీష సన్నిభ శరీరశోభిత ధర్మాత్మజా మనోహర
నరేంద్ర దశరథ సుకుమార నన్ను మరవకుర ఇంతపరాకేలర॥
చరణము(లు):
నీవేగతిగాద నీదయలేద శ్రీవాసుదేవ
దేవాదిదేవ భవనుత మహానుభావామిత విభవ॥
ఈవేళ నామొరలను వినరాద మునిజననుతపాద
రావణాదిరిపుమథన రక్షిత భువన పవనతనయ నిత్యానందద॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - parAtpara raghuvara ninnu neranammitira paramadayAkara - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )