కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య గానసుధారస పానముజేసే
ఖరహరప్రియ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
గానసుధారస పానముజేసే
మానవులే ధన్యులు ఈ భువిలో॥
అనుపల్లవి:
ఈ నరదేహము స్థిరమని తెలియక
గానలోలుని వాసుదేవుని మరవక॥
చరణము(లు):
యోగివరేణ్యుడైన నారదముని కృపతో
భాగవతాగ్రేసరుడని వెలసిన॥
త్యాగరాజుని మరి మహాత్ములను దలచుకొని
రాగ లయాదులను బాగుగ దెలుసుకొని॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - gAnasudhArasa pAnamujEsE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )