కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నీదయ ఎటుల గల్గునో రామ
శంకరాభరణం - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నీదయ ఎటుల గల్గునో రామ
నీరజ లోచన నిరుపమ సుగుణ॥
అనుపల్లవి:
ఆదరముగ నీపాదమునమ్మిన
సాధులవలె భవ బాధలేక యుండుటకు॥
చరణము(లు):
మందరధర గోవింద నీవేగతి
ముందువెనక తోచగ నిన్ను నమ్మితి
కుందరదన శరదిందు నిభానన
సింధుశయన సురబృందవందిత నాపై॥
సామజవరద నిన్నేమని పొగడుదు
కామజనక నీకెందుకు నిర్దయ
శ్రీమనోహర కనకాంబర గిరిధర
శ్యామసుందర సుగుణాకర నామీద॥
దాసజనుల పరితాపములెల్లను
వేసరక దీర్చేవాడు నీవేగద
వాసుదేవ జగదీశ జనార్దన
భాసుర మణిమయభూష మంజులభాష॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nIdaya eTula galgunO rAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )