కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ప్రణతార్తిహర మహం భజే శంకరం॥
జంఝోటి - ఖండజాతి త్రిపుట
పల్లవి:
ప్రణతార్తిహర మహం భజే శంకరం॥
అనుపల్లవి:
ఫణితల్ప వాసుదేవ భక్తాగ్రేసరం
ఫణిహార లసితకంధరం గౌరీవరం॥
చరణము(లు):
కరుణాకరం హరం చంద్రశేఖరం
గిరిశమీశ్వరం కరిచర్మాంబరధరం॥
సురగణపూజితచరణం త్రిపుర
హరణం పదనత మృకండుసుతశరణం
స్మరహర మినశశి కృశానునయనం
తోషితార్జునం మునిజనకృత నమనం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - praNatArtihara mahaM bhajE shaMkaraM\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )