కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నీపాదములను నమ్మితినయ్య
నాయకి - ఖండజాతి ఆట
పల్లవి:
నీపాదములను నమ్మితినయ్య
శ్రీపార్థసారథి నీవేగతియని॥
అనుపల్లవి:
నాపాపజాలమెల్ల దీర్చి
కాపాడుట కెవరున్నారయ్య॥
చరణము(లు):
వాసుదేవ వనజాయత లోచన
వాసుకిశయన వరఖగవాహన॥
నీసాటిదైవ మెవరనిగాన
ఓసాధుజనజీవన నిజముగ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nIpAdamulanu nammitinayya - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )