కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ఎంతని నే వర్ణింతునో
నాటకురంజి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
ఎంతని నే వర్ణింతునో
దంతివరద శ్రీవాసుదేవ॥
అనుపల్లవి:
చింతితార్థమిచ్చి బ్రోవరాద
దాంతవినుత పరమాద్భుత సుచరిత॥
చరణము(లు):
నీలరుచిరచికురజాల - కరధృత
శైల రమాలోల - గానలోల॥
బాలగోపాల దీనపాల
బాలుడై ధృవుని బ్రోవలేద॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - eMtani nE varNiMtunO - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )