కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య మరచితివేమోనన్ను - మరవకుర రామ
పూర్వకల్యాణి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
మరచితివేమోనన్ను - మరవకుర రామ
పరమపురుష - వాసుదేవ - పరాత్పర॥
అనుపల్లవి:
ధరణిజా మానసాంభోరుహ భాస్కర
సురరిపు రావణాద్యరిహర సుగుణాకర॥
చరణము(లు):
పతితపావన నీవేగతియని నిజముగ
సతతము నమ్మితి సరసిజలోచన॥
క్షితిపతి దశరథాత్మజ లక్ష్మణాగ్రజ
శ్రితజనాధారుడని నీబిరుదుండగ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - marachitivEmOnannu - maravakura rAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )