కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య తరముగాదుర - రఘువర నీకిది
శహన - చతురశ్ర త్రిపుట
పల్లవి:
తరముగాదుర - రఘువర నీకిది
త్వరితముగ నన్ను - బ్రోవకుండేది॥
అనుపల్లవి:
సరసిజలోచన - సకలలోకావన
నిరవధిసుఖద - నీకెందుకు నిర్దయ నాపై॥
చరణము(లు):
కరిమొరలను విని - బ్రోవలేద - మును
పరమ భక్తుడైన - ప్రహ్లాదుని బ్రోవలేద॥
మురహర వాసుదేవ - మదన కోటి సుందర
వరమైన నీదు మహిమ - వర్ణింప నా తరమ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - taramugAdura - raghuvara nIkidi - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )