కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నినువినా నన్నుబ్రోచే వారెవరుర - రఘువర
భైరవి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నినువినా నన్నుబ్రోచే వారెవరుర - రఘువర
నీ పదాంభోజము - నే విడజాల॥
అనుపల్లవి:
పన్నగారి వాహన - పాలిత వారణ
పతితపావన - వాసుదేవ - పన్నగశయన॥
చరణము(లు):
భూమిజా రమణ - నీ కెందుకు నిర్దయ
నీమహిమల నేనేమని పొగడుదు॥
శమధన నుతాశ్రిత కామితదాయక
కమలసంభవాది పూజిత - నిన్నె నెరనమ్మితి॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - ninuvinA nannubrOchE vArevarura - raghuvara - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )