కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య రారా యని పిలిచితే - రావదేమిరామ
ఖరహరప్రియ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
రారా యని పిలిచితే - రావదేమిరామ
లోకాభిరామ - కోదండరామ - పట్టాభిరామ॥
అనుపల్లవి:
ఈరేడు లోకములలో - నీవలె శరణాగతరక్షకుడు
వేరెవరున్నారు - కరుణా జలనిధే తామసంబు సేయక॥
చరణము(లు):
ఇలలో ఈకలిలో - జేసిన దెల్ల మరచితివేమో
అలనాడు నీవె రామదాసుని బ్రోవలేద॥
ఏలావతారమెత్తితివో - యేమేమి జేసితివో
ఈలాగని నిన్ను వర్ణింపలేను - వాసుదేవ బ్రోవు॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - rArA yani pilichitE - rAvadEmirAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )