కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య వరములొసగి బ్రోచే బిరుదు నీకుండగ
శుద్ధ సావేరి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
వరములొసగి బ్రోచే బిరుదు నీకుండగ
సరగున నన్ను పాలింపరాద రామ॥
అనుపల్లవి:
ధరణిజా రమణ నీమహిమ వర్ణింప నా
తరముగాదు - నే పరులను వేడను॥
చరణము(లు):
ఓ కమలాసనాది వినుత సుచరిత
శ్రీకర తారక మంత్ర రూపాశ్రిత॥
లోకరక్షక వాసుదేవ దయాన్విత
నీకృపగల్గని కారణమేమయ్య॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - varamulosagi brOchE birudu nIkuMDaga - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )