కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పాలయమాం - పరమేశ్వర - శంకర
కేదారగౌళ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పాలయమాం - పరమేశ్వర - శంకర
శైలసుతావర - శశధర శేఖర॥
అనుపల్లవి:
నీలకంధర - హర - పాలిత మునివర
ఫాలలోచన - కాలకాల - త్రిపురహర॥
చరణము(లు):
పరమకృపాకర దురిత విదూర
శరణజనాధార శంబరారిహర॥
వారణచర్మాంబర వరజాహ్నవీధర
పరమపురుష వాసుదేవ కృతాదర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - pAlayamAM - paramEshvara - shaMkara - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )