కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నీకభిమానము లేద రామ నాపై
కోకిలప్రియ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నీకభిమానము లేద రామ నాపై
నీరజనేత్ర నీరదనిభగాత్ర॥
అనుపల్లవి:
ఓ కమలాసనాది వినుత చరణ
లోకరక్షక వాసుదేవ కృపాకర॥
చరణము(లు):
భూమిజా మానసాంభోరుహ భాస్కర
నీమహిమలు నేనేమని పొగడుదు॥
కామితార్థ ఫలదాన ధురీణ
ప్రేమతో బ్రోచె సమయ మిదేగద॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nIkabhimAnamu lEda rAma nApai - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )