కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య కరుణాపయోనిధే దాశరథే మామవ సీతాపతే
సురటి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
కరుణాపయోనిధే దాశరథే మామవ సీతాపతే
కమనీయ రూపనిర్జితకామ రఘుకులసార్వభౌమ॥
అనుపల్లవి:
శరణాగతార్తి హరణానఘ సుగుణామరగణ తోషణ
హరిణాంక శేఖర వరకోదండ ఖండన ధురీణ॥
చరణము(లు):
సురవైరి రావణ మథన
వరయోగి మానస సదన
శరదిందు సన్నిభ వదన
పరిపాలితాఖిల భువన॥
భరత విభీషణ లక్ష్మణాది పరివృత
పరమాద్భుత చరిత
పరమపురుష వాసుదేవ పరిపూర్ణకామ
పవనతనయవందితపద॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - karuNApayOnidhE dAsharathE mAmava sItApatE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )