కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ప్రణమత శ్రీమహాగణపతిం - పార్వతీ ప్రియసుతం
కానడ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
ప్రణమత శ్రీమహాగణపతిం - పార్వతీ ప్రియసుతం
ప్రణత జనాభీష్ట ఫలదం - పరమేశ్వర లాలితం॥
అనుపల్లవి:
మణిగణశోభిత దివ్యాభరణ భూషితం - మునివినుతం
ఫణిపతి తల్ప శ్రీవాసుదేవ సంప్రీణితం॥
చరణము(లు):
భారత లేఖన చతురం భక్తజన స్వాంతమందిరం
వారణ వదనం - ధృతమోదకం - వరపాశాంకుశధరం॥
భూరికృపాసాగరం - తారాధీశగర్వహరం
సురగణ సేనాపతి కుమార సహజం - శ్రీకరం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - praNamata shrImahAgaNapatiM - pArvatI priyasutaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )