కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య బ్రోచే వారెవరుర - నినువిన - రఘువర
కమాస్‌ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
బ్రోచే వారెవరుర - నినువిన - రఘువర
నీ చరణాంబుజమును నే విడజాల కరుణాలవాల॥
అనుపల్లవి:
ఓ చతురాననాదివందిత నీకు పరాకేలనయ్య
నీ చరితము పొగడలేను నాచింతదీర్చి - వరములిచ్చి వేగమె॥
చరణము(లు):
సీతాపతే నాపై నీ కభిమానములేద
వాతాత్మజార్చితపాద నామొరలను వినరాద॥
ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడే నీవుగదా
నాపాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చైబట్టి విడవక॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - brOchE vArevarura - ninuvina - raghuvara - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )