కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నిన్నేశరణంటినయ్య - నీరజాక్ష
ధేనుక - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నిన్నేశరణంటినయ్య - నీరజాక్ష
నన్ను బ్రోవవయ్య - శ్రీరుక్మిణీ రమణ॥
అనుపల్లవి:
పన్నగేంద్ర శయన - పన్నగారి వాహన
పన్నగాచలవాస - వాసుదేవ - దేవాదిదేవ॥
చరణము(లు):
సురభూసురార్తిహరణ
కరుణాకరామితసుగుణ
శరదిందుసన్నిభవదన
పురవైరి మానససదన॥
కరిరాజుని కృపతో
మునుబ్రోవలేద
నెరనమ్మినవారికి
నిత్యానందమిచ్చేవాడని॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - ninnEsharaNaMTinayya - nIrajAxa - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )