కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య మహాత్ములే తెలియలేరు నీ మహామహిమ రామ
ఋషభప్రియ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
మహాత్ములే తెలియలేరు నీ మహామహిమ రామ
మహానుభావాశ్రితమందార - ఏమిపొగడుదు నీదు మహిమ॥
అనుపల్లవి:
మహీసుతామనోహర - మదనకోటిసుందర
మహాప్రభో నన్ను మరవకుర - కృపజేసి బ్రోవవయ్య॥
చరణము(లు):
కరధృతసురుచిర చాపశర
సురరిపుదశముఖనాశకర
పురహర కార్ముక దర్పహర
సురమునిమానసతోషకర॥
పరాంగనా సహోదర
పరమపురుషశ్రీకర
పరాత్పర వాసుదేవ
కరుణాసాగర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - mahAtmulE teliyalEru nI mahAmahima rAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )