కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శంభోశంకర పాహిమాం
కేదారగౌళ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
శంభోశంకర పాహిమాం
జంభారి వినుత పాదాంభోరుహ॥
అనుపల్లవి:
అంభోధిరాజగర్వహరణ నిపుణ
కుంభోద్భవాది సకల మునిజన శరణ॥
చరణము(లు):
కరుణాకర - వాసుదేవమోదకర
పరమేశ్వర - గిరీశ - శివ పశుపతే॥
గిరిరాజబాలికా కరాంబురుహ
పరిపూజితాహిభూష చంద్రమౌళే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shaMbhOshaMkara pAhimAM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )