కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య గురుకృపలేక శ్రీహరికృప గల్గునా
పుష్పలతా - త్ర్యశ్ర రూపక
పల్లవి:
గురుకృపలేక శ్రీహరికృప గల్గునా
హరిమతమే గురుమతము గాదేమయ్య॥
అనుపల్లవి:
గురుకృపలేక భాస్కరతనూజునికి మును
కరగతమైన దివ్యాస్త్రములేమాయె॥
చరణము(లు):
గురుకృప గల్గిన సురపతి తనూజుని
పరమపురుషుడైన శ్రీవాసుదేవుడే॥
పరమాదరముగ పాలించెలేదా
దొరకునేమి కలినరులకీ భాగ్యము॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - gurukR^ipalEka shrIharikR^ipa galgunA - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )