కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నీవేగతియని నిన్ను నెరనమ్మితి నీరజాక్ష కృష్ణ॥
కల్యాణి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నీవేగతియని నిన్ను నెరనమ్మితి నీరజాక్ష కృష్ణ॥
అనుపల్లవి:
నీవేపాంచాలిని ప్రహ్లాదుని బ్రోవలేద శ్రీవాసుదేవ॥
చరణము(లు):
నీవనాదరణ జేసితె
యెవరు నన్నుబ్రోచే వారు॥
దేవదేవ శ్రీరుక్మిణీరమణ
జీవలోకరక్షణ ధురీణ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nIvEgatiyani ninnu neranammiti nIrajAxa kR^iShNa\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )